Allu Arjun: న్యూ లుక్ కోసం అల్లు అర్జున్ రోజుకు ఎన్ని గంటలు కష్టపడుతున్నాడో తెలుసా?

అల్లుఅర్జున్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ నటుడు. సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి చాలా హిట్ సినిమాలను అందించాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ యాక్టింగ్, యాక్షన్ లను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. బన్నీ క్రేజ్ సౌత్ లోనే కాదు. పుష్ప సినిమా విడుదలయ్యాక ఇండియామెుత్తం పెరిగింది. తొలి పాన్ ఇండియా చిత్రం పుష్ప ద్వారా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంతకాలం స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్పలో రగ్గడ్ లుక్ లో కనిపించాడు. మరో విషయం ఏంటంటే..

41 ఏళ్ల వయసులోనూ అల్లు అర్జున్ (Allu Arjun) చాలా ఫిట్ గా కనిపించడం, అతడి ఫిట్ నెస్ సీక్రెట్ పై అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. అల్లు అర్జున్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏమిటంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే 45 నిమిషాల పాటు జాగింగ్ చేయడం. తనకు జాగింగ్ అంటే చాలా ఇష్టమని, చాలా ఎంజాయ్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది బన్నీ దినచర్యలో భాగం, రోజూ జాగింగ్ చేయడం కూడా ఆర్యోగ్యానికి చాలా మంచిది. అల్లు అర్జున్ ఎలాంటి వర్కౌట్ చేసినా ఎంజాయ్ చేస్తుంటాడు.

ముఖ్యంగా సైకిల్ తొక్కడం. అయితే ఒక్కోసారి సైకిల్ తొక్కడం కూడా ఇష్టం. సైక్లింగ్ కూడా మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది. మనం కూడా రోజూ భోజనం, స్నాక్స్‌ని ఏ విధంగా తప్పకుండా చేస్తామో అదే విధంగా వర్కవుట్ చేయాలి. దీనికోసం కష్టపడాలి. అల్లు అర్జున్ వారానికి ఏడెనిమిది సెషన్లు వర్కవుట్ చేయడానికి కేటాయిస్తున్నాడు. ఒక్కోసారి నాలుగు సెషన్లు కూడా పూర్తవుతాయి. అల్లు అర్జున్ ఫిట్ నెస్ కోసం రోజు 6 నుంచి 8 గంటల వర్కవుట్లు చేశాస్తారని అంటున్నారు.

ఫిట్‌గా ఉండడమంటే కేవలం వర్కవుట్ చేయడమే కాదు. దీనితో పాటు, సరైన ఆహారాన్నిఅనుసరించడం కూడా చాలా ముఖ్యం. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చాలా ‘రా అండ్ రగడ్’గా ఉంటుంది. దీనికోసం ఆయన కొన్ని నెలల పాటు ప్రత్యేక డైట్ ను ఫాలో అయ్యారట.

షూటింగ్ లేకపోయినా బన్నీ ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఇక టాలీవుడ్లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన తొలి హీరోగా బన్నీకి పేరుంది. ఈ క్రమంలో పుష్ప-2లో మరింత రగ్లడ్ లుక్ లో కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. జిమ్లో చెమటలు చిందిస్తూ వర్కవుట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీరూ చూసేయండి మరి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus