Devara: నాన్నకి ఒక పాన్‌ ఇండియానే.. కూతురికి రెండో సినిమా రెడీ.. ఏదంటే?

అల్లు వారి కుటుంబంలో నాలుగో తరం ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేసింది. అల్లు అర్జున్‌ (Allu Arjun) వారసుడిగా అయాన్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు, నాలుగో తరం అయాన్‌తోనే అనుకుంటుండగా ‘నేనున్నా’ అంటూ అర్హ (Allu Arha) ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది. ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో ఆమె నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ మురిసిపోయారు. ఆమెకు కూడా ఫ్యాన్స్‌ అయిపోయారు. అయితే ఇప్పుడు మరోసారి తమ అభిమాన నటిని వెండితెరపై చూడటానికి వారు రెడీ అయిపోవచ్చు.

అవును, అర్హ రెండో సినిమా ఓకే అయిందట. తొలి సినిమా ‘శాకుంతలం’ పాన్‌ ఇండియా సినిమానే అయినా సరైన విజయం అందుకోలేదు. ఇప్పుడు రెండో సినిమా కూడా పాన్‌ ఇండియానే. ఆ లెక్కన బన్నీ ఇప్పటివరకు ఒక పాన్‌ ఇండియా సినిమానే చేయగా… కూతురు అర్హ రెండో పాన్‌ ఇండియా సినిమా ఓకే చేసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చేయబోతున్న రెండో సినిమా ‘దేవర’ (Devara)  కాబట్టి. ఈ సినిమా హీరోయిన్‌ చిన్నప్పటి పాత్రలో అర్హ నటిస్తోందట.

దీంతో తారక్‌ (Jr NTR) సినిమాలో లిటిల్‌ మేనకోడలు నటిస్తోంది అంటూ చర్చలు మొదలయ్యాయి. తారక్‌, బన్నీ బావా బావా అని పిలుచుకుంటా ఉంటారు. ఆ లెక్కన ఎన్టీఆర్‌కి అర్హ మేనకోడలే కదా. మరోవైపు బన్నీ ఫాన్స్, మెగా ఫాన్స్ ఆనందానికి కూడా అవధులు లేవు. ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ ‘RRR’ సినిమాలో నటించి మెప్పించారు. బన్నీతో కూడా తారక్‌ కలిసి నటిస్తే బాగుండు అని అనుకుంటున్నా… ఆ కాంబినేషన్‌ ఇప్పట్లో కష్టమే అని తేలింది.

అయితే ఇప్పుడు అర్హ రూపంలో ఈ రెండు కుటుంబాల సినిమా వస్తోంది అనేది ఫ్యాన్స్‌ ఆనందం. ఇక ‘దేవర’ సినిమా సంగతి చూస్తే… శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి ఇప్పుడు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. తారక్‌ ఇప్పుడు ‘వార్‌ 2’ పనుల్లో ఉన్నాడు. ఓ షెడ్యూల్‌ తర్వాత మళ్లీ ‘దేవర’ సెట్స్‌కి వస్తాడట. అలా సెప్టెంబరు 5న సినిమా రిలీజ్‌ చేస్తాం అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus