‘పుష్ప 2’ తో (Pushpa 2) అల్లు అర్జున్ (Allu Arjun) ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు. అప్పటివరకు టాలీవుడ్ నుండి ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అని అంతా అనుకున్నారు. కానీ అతనికి ఏమాత్రం తీసిపోని విధంగా అల్లు అర్జున్ కూడా దూసుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి బాలీవుడ్ నుండి కూడా బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ టైంలో బన్నీ అస్సలు కంగారు పడట్లేదు. తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ తో సెట్ చేసుకున్నాడు.
కానీ అది ఆలస్యం అయ్యేలా ఉంది అని భావించి.. ఇప్పుడు అట్లీతో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు టాక్ చాలా రోజుల నుండి నడుస్తుంది. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ తో బన్నీ సినిమా కచ్చితంగా ఉంటుంది. మరోపక్క దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. దిల్ రాజుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.
తన వద్దకు వచ్చే మంచి కథల్ని ముందుగా అల్లు అర్జున్ వద్దకే పంపుతుంటాడు దిల్ రాజు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అయితే వీరి కాంబినేషన్లో ‘ఐకాన్’ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) దాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అనౌన్స్మెంట్ తర్వాత దాని గురించి చప్పుడు లేదు.
తర్వాత ఆ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుంది అని దిల్ రాజు అలాగే బన్నీ వాస్..లు చెప్పుకొచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. అయితే అల్లు అర్జున్ – దిల్ రాజు ఇప్పుడు ఓ కొత్త స్క్రిప్ట్ కోసం అన్వేషిస్తున్నారట. అంటే ‘ఐకాన్’ గురించి వాళ్ళు కూడా పూర్తిగా మర్చిపోయినట్టే అని అర్థం చేసుకోవచ్చు.