వైరలవుతున్న బన్నీ లుక్..!

గత రెండు సంవత్సరాల నుండీ సరైన హిట్టందుకోలేకపోయాడు అల్లు అర్జున్. ఆయన గత చిత్రాలు ‘దువ్వాడ జగన్నాథం- డీజే’ చిత్రం యావరేజ్ కాగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ చిత్రం తరువాత చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌… త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషనలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈమద్యే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని.. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ కూడా మొదలైంది. ఇక ఈ చిత్రం ఆన్‌ లోకేషన్‌ స్టిల్స్ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్‌తో ఫార్మల్‌ డ్రస్‌లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు బన్నీ. ఈ లుక్స్‌తో పోస్టర్‌లను కూడా డిజైన్‌ చేసి పండగ చేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్‌. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్దే, నివేదా పెత్తురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా… నవదీప్‌, సుశాంత్ లు కూడా కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus