Allu Arjun: ప్రభాస్ దారిలో బన్నీ పయనిస్తారా.. ఆ కామెంట్స్ కు చెక్ పెడతారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథల ఎంపికలో ఆచితూచి బన్నీ అడుగులు వేస్తుండగా బన్నీ పుష్ప2 (Pushpa 2) తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. వేర్వేరు కారణాల వల్ల అట్లీకి (Atlee Kumar) నో చెప్పిన బన్నీ నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథను విన్నారని తెలుస్తోంది. జైలర్ (Jailer)  సినిమాతో నెల్సన్ (Nelson Dilip Kumar) పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగింది. బీస్ట్ (Beast) మినహా ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి హిట్ గా నిలిచింది.

నెల్సన్ కు బన్నీ ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు బన్నీ ఒకటి కంటే ఎక్కువ సినిమాలలో ఒకే సమయంలో నటిస్తే బాగుంటుందని స్టార్ హీరో ప్రభాస్ ను బన్నీ ఫాలో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాకే బన్నీ మూడేళ్లు పరిమితం కావడం అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. ప్రభాస్ (Prabhas) దారిలో బన్నీ పయనిస్తారా లేదా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

బన్నీ వేగంగా సినిమాలు చేయడం లేదనే ప్రశ్నలకు కచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. బన్నీకి నార్త్ బెల్ట్ లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తే బన్నీ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు పుష్ప2 షూటింగ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

సుకుమార్ (Sukumar) వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందని జరుగుతున్న ప్రచారంలో నిజనిజాలు తెలియాల్సి ఉంది. పుష్ప ది రూల్ డిసెంబర్ 6వ తేదీన కచ్చితంగా రిలీజ్ చేయాలని బన్నీ పట్టుదలతో ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus