Pushpa 2 Postponed: ‘పుష్ప2’.. అనుకున్నదే అవుతుందా..!

అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa: The Rise)  సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో కంటే ఎక్కువగా ఈ సినిమా నార్త్ లో సక్సెస్ సాధించింది. ఈ చిత్రం 2 పార్టులుగా రాబోతుంది అని మొదటి పార్ట్ రిలీజ్ అవ్వకముందే చిత్ర బృందం ప్రకటించింది. ఇక మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో.. రెండో పార్ట్ ను కూడా గ్రాండ్ గా ప్రారంభించారు.80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.

ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఈ మధ్యనే ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో అతని పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) ఆగస్టు 15 కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదట. అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లోనూ అదే డేట్ సినిమా రావాలని డెడ్ లైన్ పెట్టారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో దర్శకుడు సుకుమార్ సంతృప్తి చెందలేదట.

జూలై ఎండింగ్ కి అనుకున్న షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినా.. ఈ ప్యాచ్ వర్క్ కి మరికొంత సమయం పడుతుంది. సో ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 15 రోజులు లేదా 3 వారాలు టైం పెట్టొచ్చని తెలుస్తుంది. సుకుమార్ కూడా షూటింగ్ వర్క్ ని తొందరగా ఫినిష్ చేసే రకం కాదు. ఎల్లుండి రిలీజ్ డేట్ అని తెలిసినా.. ఈరోజు కూడా షూటింగ్ జరిపే రకం అతను.

చివరి రోజుల్లో టీంని గందరగోళానికి గురి చేస్తుంటాడు సుకుమార్. ‘పుష్ప 2 ‘ విషయంలో అలాంటిది జరగకుండా సమాంతరంగా ప్రమోషన్స్ నిర్వహించాలి. ఈసారి నార్త్ లో ప్రమోషన్స్ చేయకపోతే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఆలోచించే మేకర్స్ ‘పుష్ప 2 ‘ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus