‘దిస్ ఈజ్ టుమారో’ అని అల్లు అరవింద్ గారు తన ‘ఆహా’ డిజిటల్ ప్లాట్ ఫామ్ లాంచింగ్ వేడుకలో చెప్పారు. ‘రానున్న రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు మరింత డిమాండ్ పెరుగుతుంది. దీనిని ఓ శత్రువు లాగా భావించి… దూరం పెట్టడంకన్నా …దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుని నేనే ఆశ్చర్యపోయాను’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఆయన నమ్మకం ఇంత త్వరగా నిజమవుతుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ… ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ గారి ‘ఆహా’ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ‘కొత్త పోరడు’ ‘సిన్’ వంటి వెబ్ సిరీస్ లకు మంచి స్పందన లభించింది. ఇక ‘సవారి’ ‘ఖైదీ’ ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలను కూడా కొనుగోలు చేసారు. ఫిబ్రవరి లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారు.
త్వరలోనే ఈ చిత్రం ఆహా లో ప్రత్యక్షం కానుంది. ఈ చిత్రం కోసం చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు ఇప్పుడు ఎలాగూ విడుదలకు నోచుకోని చిన్న సినిమాలను సైతం… అందులోనూ కంటెంట్ బాగున్న సినిమాలను… డైరెక్ట్ గా ఆహా లో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టు సమాచారం. ఏమైనా ఈ లాక్ డౌన్ టైం ను చాలా బాగ్ యూజ్ చేసుకుంటున్నారు .. అరవింద్ గారు. ఆయన తెలివే వేరు..!
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!