ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిలిమ్ తో వస్తున్న అల్లు హీరో

  • December 14, 2018 / 03:53 AM IST

మన బడా నిర్మాత ఎం.ఎస్.రాజు కొడుకు సుమంత్ అశ్విన్ నటించగా మంచి విజయం సొంతం చేసుకున్నా “లవర్స్” చిత్రంలో సప్తగిరి పోషించిన “మగజాతి ఆణిముత్యం” పాత్ర అందరికీ ఇంకా గుర్తుంది. నిజానికి ఆ సినిమా హిట్ అవ్వడానికి గల ముఖ్యకారణాల్లో సప్తగిరి కామెడీయే ప్రధానమైన అంశం. మరి మారుతి నిర్మించిన ఆ సినిమా నుంచి మారుతీ మళ్ళీ స్పూర్తి పొందాడో లేక అంతకుముందు నుంచీ మారుతి బ్యాంక్ లో ఉన్న ఒన్నాఫ్ ది స్క్రిప్టో తెలియదు కానీ.. సడన్ గా అల్లు శిరీష్ హీరోగా “జాతి రత్నం” అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడట మారుతి. ఈ విషయమై మారుతి కానీ, మెగా కాంపౌండ్ కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

కాకపోతే.. ఇన్సైడ్ సోర్సస్ ప్రకారం ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్ గట్రా పూర్తికావస్తున్నాయట. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రెజంట్ జరనేషన్ మీద, జనరేషన్ పోకడ మీద సెటైరికల్ గా ఉండబోతోందట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా ఈ ప్రొజెక్ట్ వర్కవుట్ అయితే ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. అల్లు శిరీష్ కి కూడా ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి హిట్ దొరికినట్లవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus