Allu Sirish: బన్నీ నుంచి ఆ సాయం కోరనన్న అల్లు శిరీష్.. పాలసీ పెట్టుకున్నానంటూ?

రెండేళ్ల క్రితం ఊర్వశివో రాక్షసివో (Urvasivo Rakshasivo) సినిమాతో సక్సెస్ సాధించిన అల్లు శిరీష్ (Allu Sirish) ఆ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని బడ్డీ సినిమాలో నటించారు. ఆగష్టు నెల 2వ తేదీన విడుదల కానున్న బడ్డీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. నా సినిమాను ప్రమోట్ చేయాలని బన్నీ అన్నను ఎప్పుడూ అడగలేదని శిరీష్ కామెంట్లు చేశారు. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో ఒక్క క్షణం మూవీ ఆడియో ఫంక్షన్ కు మాత్రమే బన్నీ (Allu Arjun) హాజరయ్యారని అల్లు శిరీష్ వెల్లడించారు.

నా సినిమా గురించి ట్వీట్ చేయమని అడగటానికి నేను ఇష్టపడనని అల్లు శిరీష్ వెల్లడించారు. నా ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కోసం అన్నయ్యను సంప్రదించకూడదని పాలసీ పెట్టుకున్నానని శిరీష్ తెలిపారు. గతంలో హిందీలో మ్యూజిక్ వీడియో చేశానని వేరే రాష్ట్రానికి వెళ్తున్నా కదా ప్రమోట్ చేయమని అడుగుదాం అనుకున్నానని కానీ విరమించుకున్నానని అల్లు శిరీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్న సాయం కోరితే నా వెనుక ఉండి ప్రమోట్ చేస్తున్నాడనే భావన ప్రేక్షకులకు కలుగుతుందని అనిపించిందని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. అయితే అదృష్టవశాత్తూ ఆ వీడియో 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందని అల్లు శిరీష్ పేర్కొన్నారు. ఆ సమయంలో అన్నయ్య కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారని ఆయన అన్నారు. ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్స్ కు కూడా అన్నయ్యను పిలవలేదని సక్సెస్ మీట్ కు మాత్రమే పిలిచానని అల్లు శిరీష్ వెల్లడించారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై బడ్డీ (Buddy) సినిమా తెరకెక్కగా గాయత్రి భరద్వాజ్, గోకుల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సామ్ ఆంటోన్ (Sam Anton) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. బడ్డీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus