Allu Sirish: అల్లు శిరీష్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

Advertisement

అల్లు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అల్లు శిరీష్ ఒకరు. అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా వచ్చే నెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ సినిమా సక్సెస్ సాధించడం అటు అల్లు శిరీష్ కు ఇటు అను ఇమ్మాన్యుయేల్ కు కీలకమనే సంగతి తెలిసిందే.

అల్లు శిరీష్ ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు అల్లు అర్జున్ లేదా మరో మెగా హీరో ఫేవరెట్ హీరో అయ్యి ఉండవచ్చని చాలామంది భావిస్తారు. అయితే అల్లు శిరీష్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఒక అమ్మాయిని తాను లవ్ చేశానని అయితే ఆ అమ్మాయితో బ్రేకప్ జరిగిందని అల్లు శిరీష్ పేర్కొన్నారు.

అల్లు శిరీష్ కు అను ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అల్లు శిరీష్ కామెంట్లు చేశారు. వేర్వేరు కారణాల వల్ల ఊర్వశివో రాక్షసివో మూవీ గతేడాది షూటింగ్ ను పూర్తి చేసుకున్నా ఆలస్యంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాతో అల్లు శిరీష్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

అల్లు శిరీష్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అల్లు శిరీష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు మినహా అల్లు శిరీష్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఊర్వశివో రాక్షసివో సినిమాతో అల్లు శిరీష్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus