టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కు స్టార్ స్టేటస్ మాత్రం రావడం లేదు. తన అన్న అల్లు అర్జున్ స్టార్ గా కొనసాగుతుంటే.. అల్లు శిరీష్ కి మాత్రం ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. మధ్యలో ఒకట్రెండు హిట్లు వచ్చినప్పటికీ.. అవి తన కెరీర్ కు ఎంతమాత్రం కలిసిరాలేదు. అల్లు అరవింద్ కూడా శిరీష్ పై పెద్దగా ఫోకస్ పెడుతున్నట్లు లేదు. ఆయన తలచుకుంటే కొడుకు కోసం సరైన డైరెక్టర్ ని తీసుకొచ్చి హిట్ తీసుకురాగలడు.
కానీ మార్కెటింగ్ లెక్కలు అన్నీ చూసుకొని పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేడు. ఆ విషయం పక్కన పెడితే.. ‘విజేత’, ‘జత కలిసే’ అనే రెండు ప్లాప్ సినిమాలను రూపొందించిన రాకేష్ శశి అనే డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టడం ఆశ్చర్యంగా మారింది. ఈ సినిమాతో అల్లు శిరీష్ కు బ్రేక్ ఇవ్వడం కంటే.. ఈ సినిమాతో రాకేష్ కు సక్సెస్ కావాలి. నిజానికి ఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది.
తమిళంలో సక్సెస్ అయిన ‘ప్యార్.. ప్రేమ.. కాదల్’ అనే సినిమాకు రీమేక్ గా ‘ప్రేమ కాదంట’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సినిమా మంచి సక్సెస్ అందుకుంది. యూత్ ఫుల్ సినిమా కావడం.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ల రొమాన్స్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో తెలుగులో కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడు మాత్రమే. విజయ్ అనే వ్యక్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.