కొత్త మూవీ వివరాలు వెల్లడించిన అల్లు శిరీష్!

  • October 12, 2016 / 01:04 PM IST

స్లో పాయిజన్ల యువత హృదయాల్లో చేరుకుంటున్న నటుడు అల్లు శిరీష్. మూడేళ్ళ క్రితం గౌరవం సినిమాతో హీరో గా పరిచయమైన శిరీష్ మెల్లగా అడుగులు వేస్తున్నాడు. గత ఏడాది కొత్త జంట మూవీతో ఓ మోస్తరు హిట్టు అందుకున్న అల్లు అరవింద్ చిన్న కొడుకు.. ఈ సంవత్సరం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.

ఆ ఫిల్మ్ విజయానందంలో నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఏమైందో ఏమో గాని వేణు ని పక్కన పెట్టి దసరాకి కొత్త నిర్ణయం తీసుకున్నాడు. గతంలో సందీప్ కిష‌న్ హీరోగా టైగ‌ర్ సినిమాని తెర‌కెక్కించిన వి.ఆనంద్ డైరక్షన్లో పనిచేయనున్నట్లు వెల్లడించాడు. “శుభదినమైన దసరా రోజు  డైరెక్ట‌ర్ వి.ఆనంద్ తో కలిసి నా కొత్త చిత్రం : సైన్స్ ఫిక్స‌న్ థ్రిల్ల‌ర్ పనిని ప్రారంభిస్తున్నాను.

మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేసాడు. వి.ఆనంద్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా “ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా” అనే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కంప్లీట్ కాగానే అల్లు శిరీష్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus