Allu Sirish : బాబాయ్ పెళ్లి డేట్ రివీల్ చేసిన కూతుర్లు..!

Allu Sirish : అల్లు కుటుంబానికి చెందిన యువ హీరో అల్లు శిరీష్ మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత హాస్య బ్రహ్మ అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిరీష్, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు.

గతంలోనే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న విషయం అభిమానులకు తెలిసిందే. అయితే పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం శిరీష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆ సస్పెన్స్‌కు ఒక ఫన్నీ వీడియో ద్వారా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ట్రెండీ వీడియోలో… చిన్నారులు “బాబాయ్ పెళ్లెప్పుడు?” అని అడిగితే, నవ్వుతూ “మార్చి 6, 2026” అని రివీల్ చేశారు. ఈ వీడియోలో అల్లు అయాన్, అల్లు అర్హ చేసిన అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు “సంగీత్ ఎప్పుడు?” అన్న ప్రశ్నకు “మనం సౌత్ ఇండియన్స్ కదా” అంటూ ఇచ్చిన సమాధానం వీడియోకు మరింత ఫన్ యాడ్ చేసింది.

ఇక కాబోయే భార్య నయనిక విషయానికి వస్తే… హైదరాబాద్‌లో పెరిగిన ఆమె బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఓ ప్రైవేట్ పార్టీ నుంచే వీరి ప్రేమ కథ మొదలై, ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. మొత్తానికి ఈ వైరల్ వీడియోతో అల్లు శిరీష్ పెళ్లి వార్తలు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. అభిమానులు శుభాకాంక్షలతో కామెంట్లు పెడుతున్నారు.

 

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus