అల్లు శిరీష్ సరసన మహాలక్ష్మి!

  • May 11, 2016 / 10:16 AM IST

“కృష్ణగాడి వీరప్రేమగాధ” చిత్రంలో “మహాలక్ష్మి”గా తెలుగువారి హృదయాల్లో చెరగని సంతకం చేసిక ముంబై ముద్దుగుమ్మ మేహరీన్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అనంతరం.. సాయిధరమ్ తేజ్ సరసన బివిఎస్ రవి దర్శకత్వంలో నటించే అవకాశం అందిపుచ్చుకొని బాలీవుడ్-టాలీవుడ్ లలో తన హవా కొనసాగిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మెగా హీరో అల్లు శిరీష్ నాలుగో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకొందని తెలుస్తోంది. మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందని.. ప్రస్తుతం ఆ సెకండ్ హీరోయిన్ ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus