అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో ఎప్పుడూ కూల్ గానే ఉంటారు. ఆమె ఎక్కువగా పిల్లలు అయాన్, ఆర్హా క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యామిలీ బాండింగ్‌ను అభిమానులతో పంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండే స్నేహా, ఈసారి ఇచ్చిన ఒక సందేశం నెట్టింట చర్చకు దారితీసింది. అయితే, ఆమె చెప్పిన మాటలు సామాన్యమైనవి అయినా, అందులోని భావన నెటిజన్లను ఆలోచనలో పడేసింది. స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘6 PM రూల్’ అనే ఒక కాన్సెప్ట్‌ను షేర్ చేస్తూ ఇలా రాసింది:
“ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియా షాప్‌లా మూసివేస్తే ఎంత బాగుంటుంది. మనం కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ మాట్లాడేవాళ్లం. బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించేవాళ్లం. పుస్తకాలు చదువుతూ, కళలు, సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాళ్లం” అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ సింపుల్ మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్నేహా చెప్పిన ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే దానిపై నెటిజన్లలో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల అల్లు అర్జున్ కుటుంబం అనుకోని పరిణామాలతో కొంత ఇబ్బంది ఎదుర్కొందన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ బన్నీ ఫ్యామిలీకి మానసిక ఆవేదన కలిగించాయని కూడా చెబుతున్నారు. బహుశా ఆ పరిణామాలే స్నేహా ఈ ‘6 PM రూల్’ సందేశం ద్వారా అందరికీ ఒక ఆలోచనను పంచుకోవాలనే ఉద్దేశంతో చెప్పి ఉంటారనేది నెటిజన్ల అభిప్రాయం.
సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ప్రతి ఇంటి జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ, నిజమైన జీవితంలో మనం ప్రేమించే వారితో గడిపే సమయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో స్నేహా ఇచ్చిన ఈ సందేశం చాలా మందికి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు, కానీ ఫ్యామిలీతో, స్నేహితులతో గడిపే క్షణాలు మరింత విలువైనవని ఆమె చెప్పినట్లు అనిపిస్తుంది.