Allu Arjun: నేషనల్ అవార్డు రావడంతో పుష్పకి పార్టీ ఇచ్చిన మామ!

Ad not loaded.

ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పుష్ప సీక్వెల్స్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాలో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాలోని తన నటనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నారు.

ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి అవార్డు అందుకోలేదు ఇలా జాతీయ అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు. ఈ వేడుకను గత రెండు రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలా నేషనల్ అవార్డు అందుకున్న అనంతరం ఈయన హైదరాబాద్ కి రావడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ఇక తన (Allu Arjun) అల్లుడు కెరియర్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కడంతో అల్లు స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా తన అల్లుడికి పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈయన అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు పుష్ప సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేశారు.

ఇక అల్లు అరవింద్ తో ఆయన ముగ్గురు కుమారులు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో పుష్ప సీక్రెట్ చిత్రంపై మరింత బాధ్యతలు పెరిగాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus