మహానటుడు నందమూరి తారక రామారావు మనవుడిగా తారక్ చిత్ర సీమలోకి అడుగుపెట్టి.. ఆయన సంపాదించుకున్న అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రతి విషయంలో ఆయన్ను ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా తాతలాగా నెగిటివ్ పాత్రలో మెప్పించారు. జై లవకుశ లో జై పాత్రకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఓ పత్రికకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర సంగతులు చెప్పారు. “ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూనే ‘దానవీర శూరకర్ణ’కి దర్శకత్వం వహించారు. మీకు ఆ ఆలోచలేమైనా ఉన్నాయా? ” అని ప్రశించగా.. అందుకు తారక్ సమాధానమిస్తూ “అటువంటి ఆలోచన అసలు లేదు” అని స్పష్టం చేశారు “దర్శకత్వం అంటే చాలా ఫోకస్డ్గా ఉండాలి.
నా దృష్టి పూర్తిస్థాయిలో నటనపైనే ఉంది. నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఎవరి పని వాళ్లకుంది కాబట్టి, ఒకరి పనిలో మరొకరు తలదూర్చకూడదంటా.” అని డైరక్షన్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ… నెక్స్ట్ తాను త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని, అది ప్రారంభించే ముందు భార్య, అబ్బాయితో కలిసి కొన్ని రోజులు విహార యాత్రలకు వెళ్లి వస్తానని వివరించారు.