Hari Hara Veera Mallu: మొత్తానికి హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత ‘హరి హర వీర మల్లు’ అనే సినిమాని మొదలుపెట్టారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినా.. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయింది అనే చర్చ కూడా నడిచింది. మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

చిత్ర బృందం మాత్రం ఏదో ఒక పండుగ వచ్చినప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి ‘మా ప్రాజెక్ట్ ఆగలేదు’ అనే విధంగా స్పందిస్తూ వస్తుంది. తాజాగా ‘రూల్స్ రంజన్’ సినిమా వేడుకలో నిర్మాత ఏ.ఏం.రత్నం .. ‘హరి హర వీర మల్లు’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ” ‘హరి హర వీరమల్లు’ అనేది పెద్ద సినిమా. మేము సినిమా ప్రారంభించే సమయంలోనే చెప్పాము ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని..!

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. ఎక్కువ కాల్ షీట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. రీమేక్ సినిమాలు 15 , 20 రోజుల్లో కంప్లీట్ అయిపోయేవి ఒప్పుకుంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాకి ఎక్కువ సెట్లు వేయాలి. పైగా ఇది పీరియాడిక్ మూవీ కూడా..! కచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది.

మా బ్యానర్ కి ఉన్న లెజసీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది రెండు పార్టులుగా రూపొందుతుందా అని కొంతమంది అడుగుతున్నారు. అది అప్పుడే చెప్పలేము” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus