Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

నాగార్జున సతీమణి అమల అందరికి సుపరిచితమే. ఈమె మూగజీవాల కోసం బ్లూ క్రాస్ అనే సంస్థను నిర్వహిస్తున్న సంగతి కూడా చాలా మందికి తెలిసిన విషయమే. అయితే రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రమైన శివ మూవీలో హీరోయిన్ గా అమల నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున & అమల ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి. కానీ అప్పటికే నాగార్జున కి హీరో వెంకటేష్ సోదరితో వివాహం అయ్యి ఉండటం, వారికి సంతానంగా నాగ చైతన్య జన్మించటం జరిగింది. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న నాగార్జున తరువాత అమలను పెళ్లాడాడు.

దాంతో నాగ ఛైతన్య బాల్యం అంతా తన తల్లి సంరక్షణలో చెన్నైలోనే జరిగింది. ఈ మధ్యనే అమల ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నాగ చైతన్య & అఖిల్ తో తనకున్న అనుబంధం గురించి ఈ విధంగా పంచుకుంది. చైతన్య స్కూలింగ్ అంత చెన్నై లో తన తల్లి దగ్గర జరిగింది అని, కాలేజీ టైంలో హైదరాబాద్ వచ్చాడు అని అప్పటి నుంచి తనతో మంచి బాండింగ్ ఉందన్నారు. చైతన్య చాలా మంచి గుణాలు గల వ్యక్తి అని, తండ్రి మాటను ఎప్పుడు మిస్ చేయడు అని, తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉందని చెప్పుకొచ్చారు.

అదే విధంగా తన కొడుకు అఖిల్ గురించి చెప్తూ… అఖిల్ పెంపుకు మొత్తం తన వద్దే జరిగింది అని, తల్లిగా తన ప్రభావం అఖిల్ మీద ఎక్కువగా ఉందని, తాము ఇద్దరి పిల్లలని ఇండిపెండెంట్ గా జీవితంలో ఎలా ఎదగాలి అనేది తెలుపుతూ పెంచాం అని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యనే నాగ చైతన్య & అఖిల్ ఇద్దరు వివాహాలు చేసుకొని వైవాహిక జీవితంలో హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

 సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus