అమల పాల్ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే..!

అమలాపాల్ ‘ఆడై’ టీజర్ ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో అమలాపాల్ నగ్నంగా కనిపించిన కొన్ని షాట్లు ఉన్నాయి. ఇలా స్టోరీ డిమాండ్ చేసినందుకు గాను అమలాపాల్ పై సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపించారు. కథ డిమాండ్ చేయడం తో ఇలా బోల్డ్ గా నటించడానికి కూడా వెనుకాడని అమలా గ్రేట్ అంటూ వారు ఆకాశానికెత్తేశారు. ఒంటరిగా ఒంటి పై ఎలాంటి బట్టలు లేకుండా కూర్చుని ఏడుస్తున్న అమల పోస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

అమలాపాల్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీజర్లోనే కాదు సినిమాలో కూడా అమలా నగ్నంగా కనిపించిన షాట్స్ చాలా ఉన్నాయట. అంతేకాదు ఈ సీన్ల కోసం చిత్ర యూనిట్ 20 రోజులు షూటింగ్ చేశారట. 20 రోజుల పాటు బిడియం లేకుండా ఇలాంటి సన్నివేశాల్లో నటించడమంటే సాధారణ విషయం కాదు. అంతే కాదు ఈ సినిమాలో అమలాపాల్ బైక్ పై స్టంట్స్, పోరాట సన్నివేశాల్లో కూడా పాల్గొందట. మొత్తానికి ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. వారి సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus