పెళ్ళైతే ఏంటి..స్కిన్’షో కి రెడీ!!!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో అందాల భామలు పెళ్లి చాలా లేట్ గా చేసుకుంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కుటుంభం, భాద్యతలు, ఇలా ఎన్నో చిక్కుముడులు ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండేందుకు లేట్ వయసులో శ్రీమతులుగా మారతారు. అయితే కొందరు హీరోయిన్స్ పెళ్లి అయినా కాస్త గ్యాప్ తీసుకుని నటిస్తూ ఉంటారు. అందులో మన విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ నుంచి మన టాలీవుడ్ భామలు మీనా, రాశీఖన్నా, రమ్యకృష్ణ, నదియా ఇలా చాలా మందే ఉన్నారు. అయితే వీళ్లంతా స్కిన్ షో పాత్రలు, రొమ్యాంటిక్ పాత్రల్లో కాకుండా హుందాగా, అమ్మగా, అత్తగా, వదినగా ఇలా కుటుంభ తరహా పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం పెళ్ళైతే ఏంటి అందాల ఆరబోతకు తాను సిద్దమే అంటుంది…ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏమా కధ అంటే, అందాల భామ అమలాపాల్ గుర్తుందిగా, తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇక మీదట సినిమాల్లో నటించను అని చెప్పి వరుసగా సినిమాల్లో నటిస్తున్న భామ. ఈ అమ్మడికి పెళ్లైనా గ్ల్యామర్ ఫీల్డ్ పై ప్రేమ చావలేదు, అందుకే పెళ్లైనప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది, మలయాళం, తమిళం అని తేడా లేకుండా హిట్స్ ఫ్ల్యాప్స్ తో సంభందం లేకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ భామ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది అవేమిటంటే, ఇకనుంచి పూర్తి స్థాయిలో గ్లామర్ తరహా పాత్రలో నటిస్తానని అంతే కాదు సినిమాల్లో అందాలను ఆరబోయాడనికి తాను సిద్ధమేనని చెప్పిందట. హాట్ సీన్లలో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి పెళ్ళైన ఈ అందాల భామకు ఆ హాట్ కోరికలేమిటో పాపం, దర్శకుడు…అలియాస్ భర్త విజయ్ ఏమంటాడో ఆమె నిర్ణయంతో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus