హర్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా హర్రర్ నేపథ్యంలో రూపొందితే భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే జోనర్లో ‘అమరావతికి ఆహ్వానం'(Amaravathiki Aahwanam) అనే సినిమా రూపొందింది. శివ కంఠంనేని,ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రీతా, హరీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటులు కూడా కీలకపాత్రలు పోషించడం విశేషం.
జివికె ఈ చిత్రానికి దర్శకులు. ముప్పా వెంకయ్య చౌదరి.. ‘లైట్ హౌస్ సినీ మ్యాజిక్’ అధినేతలు కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.రాంబాబు యాదవ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఓ పోస్టర్ ను అలాగే గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ..”మా సినిమా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్ లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. ధన్య, ఎస్తర్,సుప్రిత వంటి మంచి క్యాస్టింగ్‌తో పాటు అశోక్ కుమార్, జెమిని సురేష్, భద్రమ్ లాంటి సీనియర్ యాక్టర్స్ మా సినిమాలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది.
దర్శకుడు జీవికే తన విజన్ తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువచ్చారు. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా మంచి కథ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. తప్పకుండా థియేటర్స్‌లో ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్ గా ఈ సినిమా నిలుస్తుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం“ అన్నారు
దర్శకుడు జివికె మాట్లాడుతూ – `ఈ మధ్య రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి. మా అమరావతికి ఆహ్వానం కూడా అదే తరహాలో మంచి విజయం అందుకుంటుంది అని భావిస్తున్నాను. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, శివ హరీశ్, అశోక్ కుమార్, జెమిని సురేశ్, భద్రమ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
మంచి ఆర్టిస్టులతో పాటు కథ, కథనం కూడా ఉత్కంఠభరితంగా ఉంటాయి. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అని అన్నారు