Jr NTR: ఎన్టీఆర్‎లోని ఆ ట్యాలెంట్‎కు అమెరికాలో కూడా అందరూ ఆశ్చర్యపోయారు!

తెలుగు ప్రేక్షకులను తన ట్యాలెంట్ తో ఫిదా చేస్తున్న టాప్ హీరోలలో తారక్ ఒకడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. ‘ఆర్ఆర్ఆర్’తో వేరే లెవల్ కి వెళ్లాడు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటనకు ప్రేక్షకులు మొత్తం ఫిదా కాగా.. యంగ్ టైగర్ తన స్థాయిని మరో మెట్టు ఎక్కించుకున్నాడు. అయితే తాజాగా తారక్ ట్యాలెంట్ కు సంబంధించిన మరో విషయం అందరిలో చర్చకు దారితీస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నేపథ్యంలో అమెరికాలో తారక్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అమెరికాలో దర్శకుడు రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ లో పర్యటిస్తుండగా.. అక్కడి తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటుతున్నారున అయితే తాజాగా అమెరికాలో ఎన్టీఆర్ మీడియా వాళ్లతో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీడియా వాళ్లతో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా మాట్లాడటం ట్రెండ్ అవుతోంది. అమెరికాలో వారి యాసలోనే ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా మాట్లాడటం అందరిలో చర్చకు దారి తీస్తోంది.

ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, జపాన్ భాషను మాట్లాడగల ఎన్టీఆర్.. తన వాక్చాతుర్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. తాజాగా అమెరికాలో అక్కడి మీడియా వాళ్లు కూడా వావ్ అని ఆశ్చర్యపోయి, ఫిదా అయ్యేలా చేశాడు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ తన యాసతో అదరగొట్టగా.. తారక్ తన స్లాంగ్ చూసి మీడియా సైతం షాక్ అయ్యారట. ఓ తెలుగు హీరో, ఇండియన్ అమెరికా యాసతో ఇరగదీయగా..

అక్కడి మీడియా వాళ్లు ముక్కు మీద వేలేసుకుని సైలెంట్ అయిపోయారు. దీంతో ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా అంతకు మించిన వ్యక్తి అంటూ అందరూ అతడి ట్యాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus