సాలిడ్ అప్‌డేట్స్‌తో అంచనాలు ఆకాశాన్నంటేలా చేసిన బాలయ్య – అనిల్ రావిపూడి..!

నటసింహ నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని.. వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్సన్ వర్క్ కంప్లీట్ చేస్తోంది టీమ్.. డిసెంబర్‌ 8న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నారు యూనిట్. 8వ తేదిన బాలయ్య ఓ మంచి మూహుర్తం ఫిక్స్ చేశారట.

ఈరోజు (డిసెంబర్ 7) మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి సమాధి వద్ద సినిమా స్క్రిప్ట్ ఉంచి పూజలు జరిపారు.. ఓపెనింగ్ నాడు అల్లు అరవింద్ క్లాప్, దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్, సుకుమార్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయనున్నారని.. అలాగే నిర్మాతలు శిరీష్, నవీన్ ఎర్నేని (మైత్రీ మూవీస్) స్క్రిప్ట్ అందించనున్నారని సమాచారం.. అనిల్ రావిపూడి ఈ మూవీలో నటసింహాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగానే కాకుండా..

ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోయే బాలయ్యకి ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కూతురిగా కనిపించనుంది. మరో కీలకపాత్ర కోసం ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ని తీసుకున్నారట.. హైదరాబాద్ బాచుపల్లిలో 12 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రవితేజ ‘ఖిలాడి’ కోసం వేసిన జైలు బరాక్ సెట్‌ను.. భారీగా పెంచి #NBK108 కోసం జైలు సెట్ భారీగా వేశారు..గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ చివరి దశలో ఉంది..

సంక్రాంతికి సినిమాని బాక్సాఫీస్ బరిలో దింపడానికి ఫుల్ జోష్‌తో పనిచేస్తోంది మూవీ టీం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నటసింహం కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టబోతుండడం విశేషం.. శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జతకడుతుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, లాల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. థమన్ కంపోజ్ చేసిన ‘మాస్ ఆంథమ్’ నెట్టింట ఓ ఊపు ఊపుతోంది.. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ రాబోతోంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus