Tholi Prema: తోలిప్రేమ క్లైమాక్స్ చూసి అమితాబ్ బచ్చన్ ఏం చేశాడో తెలుసా?

లవ్ స్టోరీస్ సినిమాల్లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’. అప్పటి వరకు చాలా మామూలు హీరోస్ లో ఒకడిగా కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో స్టార్ హీరో గా మారాడు. యూత్ ఐకాన్ గా నిలిచాడు. ముఖ్యంగా ఇందులో ఆయన నటనని చూస్తే ప్రతీ సామాన్యుడికి తన నిజ జీవితాన్ని వెండితెర మీద చూసుకున్నట్టుగా ఉంది. అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్.

అతని కెరీర్ లో ఎన్నో సినిమాలు తీసాడు కానీ, ఇలాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాన్ని మాత్రం మళ్ళీ రీ క్రియేట్ చెయ్యలేకపోయాడు. ఇలాంటి క్లాసిక్స్ ని రీ క్రియేట్ చెయ్యడం కూడా చాలా కష్టం. ఇక ఈ సినిమా విడుదలై పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా రీ రిలీజ్ జూన్ 30 వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గతం లో ఈ సినిమా క్లైమాక్స్ గురించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్పిన మాటలను కరుణాకరన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన కరుణాకరన్ తో ఏమన్నాడు అంటే ‘ నేను నీ (Tholi Prema) తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తున్నపుడు నా కార్ తాళాలను స్క్రీన్ మీదకి విసిరేసాను. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఏమిటి, అసలు ఏమి చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ ఈ సినిమాతో అని అనుకున్నాను. కానీ జయాబచ్చన్ స్లో గా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రావడాన్ని చూసి చప్పట్లు కొడుతుంది, ఆ తర్వాత అబ్బా ఏమి సినిమా ఇది,

క్లాసిక్ అనిపించింది’ అని కరుణాకరన్ తో అన్నాడట అమితాబ్ బచ్చన్. చెన్నై కి వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ కరుణాకరన్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు అట ఇవి . ఈ వీడియో నేడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus