Rajinikanth,Amitabh ; మళ్లీ మీతో పనిచేయడం గర్వంగా ఉంది..అమితాబ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన 170 సినిమాని ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులని జరుపకుంటుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో వివిధ భాషా చిత్రాలలోని నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు.

టాలీవుడ్ హీరో రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.ఈ విధంగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి మరోసారి రజనీకాంత్ నటించడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమితాబ్ గారితో నటించడం చాలా సంతోషంగా ఉందని తాను అమితాబ్ గారితో కలిసి నటించడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు అయితే రజనీకాంత్ పోస్ట్ కి అమితాబ్ రిప్లై ఇస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్‌ సార్‌, మీరు నా పట్ల చాలా దయ చూపుతున్నారు. అయితే సినిమా టైటిల్‌ని చూడండి, తలైవర్‌170 దాని అర్థం చూస్తే, మీరే లీడర్‌, హెడ్‌, చీఫ్‌, నువ్వే అధినేత, నాయకుడు, పెద్ద, ఎవరికైనా ఈ విషయంలో డౌట్‌ ఉందా? నేను నీతో పోల్చుకోలేను. మళ్లీ మీతో కలిసి పనిచేయడం గొప్పగా, గర్వంగా ఉంది అంటూ అమితాబ్‌ బచ్చన్‌.. రజనీకాంత్ రిప్లై ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus