అమితాబ్ ఆ కంపనీ పేర్లే వినలేదట..!
- April 7, 2016 / 06:33 AM ISTByFilmy Focus
పనామా బయటపెట్టిన కుంభకోణంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల పేర్లు ఉండడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కోట్లాది రూపాయలు పన్నులు ఎగ్గొట్టి, విదేశాల్లో భారీ పెట్టుబడులుపెట్టారన్న విషయాన్ని పనామా బయటపెట్టింది. దీనిపై అమితాబ్ స్పందించారు. తనకు ఏ విదేశీ కంపనీలతో డీలింగ్స్ లేవని.. పన్నులు సక్రమంగా కట్టానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పనామా చెప్పిన కంపనీ పేర్లు తను ఇప్పటివరకు వినలేదట. అలాంటప్పుడు ఆ కంపనీలకు హెడ్ గా నేను ఎలా పని చేస్తానని అన్నారు. ఇన్ని మాటలు చెప్తున్న అమితాబ్ తను తప్పుచేయలేదని నిరూపించుకోగలడా..? ఒకవేళ తనకు వ్యక్తిరేకంగా సాక్ష్యాలు దొరికితే ఏం చేస్తాడో చూడాలి..!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














