vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య
- August 14, 2026 / 01:20 PM ISTByFilmy Focus Desk
నవంబర్, డిసెంబర్‌లో పెద్ద సినిమాల రిలీజ్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ పెద్ద ఆశ్చర్యం. ముఖ్యంగా డిసెంబరులో రిలీజ్ డేట్ అని చెబితే ‘అవునా’ అనేవారు. ఎందుకంటే అదొక పెద్ద అన్ సీజన్ అని అనుకునేవారు కాబట్టి. అయితే ఈ పరిస్థితి మొత్తాన్ని మార్చేసిన హీరో అక్కినేని నాగార్జున. సంక్రాంతికి వచ్చేదేంటి.. ముందే వచ్చి సంక్రాంతి వరకు ఉంటా అని చెప్పేవారు. అలా డిసెంబరు మూడో వారంలో సినిమాను రిలీజ్ చేసి, సంక్రాంతి వరకు థియేటర్లలో ఉండేవారాయన. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ సీజన్‌ని ఆయన కొడుకు వాడుకోబోతున్నాడు అని సమాచారం.
vrushakarma
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. నిజానికి ఈ పాటికి సినిమా షూటింగ్ అయిపోయి, విడుదలకు సిద్ధం అవ్వాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకు రిలీజ్ డేట్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు ఓ టీజర్ వీడియోను రెడీ చేస్తున్నారు అని తెలిసింది. అందులో డిసెంబరు డేట్‌నే అనౌన్స్ చేస్తారటట.
పురాణాంశాలతో మిళితమైన ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌లో చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. గతంలో ఈ మేరకు చైతునే చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా ఏమవుతోంది అనే ప్రశ్న ఉండింది. అయితే ఈ రిలీజ్ డేట్ లీక్‌తో సినిమా ముచ్చట్లు బయటకు వచ్చాయి. కాస్త థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథతో చైతు వరుసగా రెండో హిట్ కొట్టే ఆలోచనలో ఉన్నాడు. గత సినిమా ‘తండేల్’ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితమే అందుకుంది.
ఈ సినిమా తర్వాత చైతు ‘దూత 2’ వెబ్‌సిరీస్ పనుల్లో బిజీ అవ్వబోతున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్‌కు మంచి స్పందనే వచ్చింది. దీంతో రెండో సిరీస్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.













