Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్ కొడితే చాలు.. అందరూ ట్రాక్ ఎక్కేసినట్లే?
- August 14, 2026 / 12:02 PM ISTByFilmy Focus Desk
మెగా కుటుంబానికి గతేడాది ఆఖరు నుండి అన్నీ కలిసొస్తున్నాయి. వచ్చిన సినిమా వచ్చినట్లు విజయం సాధిస్తోంది. ఒక సినిమాకు విమర్శలు వచ్చినా వసూళ్ల పరంగా, ఫలితం పరంగా మంచిగానే రిజల్ట్ వచ్చింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఇద్దరు హీరో వైపు పడింది. ఎందుకంటే ఒక హీరో చాలా రోజులుగా ఒకే సినిమా పట్టుకొని ఉండగా, మరో హీరో అసలు సినిమా ఊసే లేకుండా ఉన్నాడు. వారే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. ఈ ఇద్దరు కూడా హిట్ కొట్టేస్తే మెగా హీరోలు అందరూ హిట్ ట్రాక్‌లోనే ఉన్నారు అని ఆనందంగా చెప్పొచ్చు.
Sai Durgha Tej – Vaisshnav Tej
గతేడాది ఆఖరులో ‘ఓజీ’ అంటూ వచ్చి పవన్ కల్యాణ్ తన సత్తా ఏంటో చాటాడు. భారీ విజయం, వసూళ్లతో పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మారింది. ఆ తర్వాత సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అంటూ వచ్చిన చిరంజీవి బాక్సాఫీసు రికార్డులను బద్ధలుకొట్టాడు. ఎప్పటిలా కొత్త రికార్డులు రాశాడు. ఇక మొన్నీ మధ్య వచ్చిన ‘పెద్ది’ సినిమా రామ్‌చరణ్‌లో కెరీర్ బెస్ట్ అనిపించుకుంది. వసూళ్ల సంగతి బాగున్నా.. ఇంకా బాగుండాల్సింది అనే మాట వినిపించింది.
ఇక ఇప్పుడు చర్చంతా వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ గురించే. గత కొన్నేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ ఎట్టకేలకు కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చాడు. దీంతో ‘సంబరాల యేటి గట్టు’ మీద అందరి చూపూ పడింది. ఆ సినిమా చాలా ఏళ్లుగా తెరకెక్కుతూనే ఉంది. త్వరలోనే విడుదల అంటున్నారు కానీ డేట్ క్లారిటీ లేదు. వస్తే ఆ సినిమా కూడా విజయం సాధించాలి అనేది మెగా అభిమానుల ఆశ పడుతున్నారు. మూడేళ్ల తర్వాత సాయితేజ్ చేస్తున్న సినిమా ఇది.
సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా ఇంతే. 2023లో చేసిన ‘ఆదికేశవరెడ్డి’ తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కథ కూడా వినలేదు. దీంతో ఎప్పుడు సినిమా చేస్తాడు, ఎప్పుడు రిలీజ్ చేస్తాడనేది పాయింట్.












