పుష్ప ప్రస్తుత జనరేషన్లో ఈ సినిమా పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇందులోని పాటలు సృష్టించిన సునామీ మాములిది కాదు. రెండేండ్ల పిల్లలు మొదలు ముసలోల్ల వరకు ప్రపంచమంతా డ్యాన్సులు వేసిన వారే. ముఖ్యంగా క్రికెట్, పుట్‌బాల్ ఆటగాళ్లు గ్రౌండ్లలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తూ చేసిన హంగామాతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అల్లు అర్జున్‌కు, దేవీశ్రీ ప్రసాద్‌లకు జాతీయ ఆవార్డులను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
విషయానికి వస్తే బాలీవుడ్ బాద్షా కౌన్ బనేగా కరోడ్‌పతి సిరీస్‌ను విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న 15వ సీజన్ 62వ ఎపిసోడ్లో ఒడిస్సా నుంచి వచ్చిన కంటెస్టెంట్ ఇప్సితను రూ.20,000 ప్రశ్నగా ఈ ఏడాది ఉత్తమ జాతీయ నటుడి ఆవార్డు అందుకున్నది ఎవరని బిగ్ బీ అడగగా ఆమె అల్లు అర్జున్ అని సమాధానం తెలిపింది. ఈ క్రమంలో అమితాబ్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఎపిసోడ్ నిన్న సోనీలో టెలికాస్ట్ అవగా అది వీక్షించిన వారు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ ‘పుష్ప సినిమా ఈ మధ్య వచ్చిన వాటిల్లో మంచి సినిమా అని అందులోని శ్రీవల్లి పాటలో అర్జున్ చెప్పు వదిలేసి తిరిగి వేసుకునే మూమెంట్ అంతలా వైరల్ కావడాన్ని నేను నా జీవితంలో చూడలేదని అవే స్టెప్పులను ఇప్పటికీ చాలా మంది అలానే చేస్తూ ఉండడాన్ని నేను గమనించి నవ్వుకుంటానని చెప్పుకొచ్చాడు’. దీంతో అర్జున్ ఫ్యాన్స్ అమితాబ్ కామెంట్స్ ను సోషల్‌మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. సినిమా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తై కొత్తగా (Pushpa) పుష్ప2 చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలోనూ ఈ పాట ఎక్కడో చోట ఎవరో ఓకరు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేలా చూస్తున్నారు. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు మంచి ప్రాచూర్యం కల్పించడంలో అస్టేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య భూమిక పోషించాడంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ వార్నర్ ఈ పాట స్టెప్పును, అర్జున్ మేనరిజాన్ని స్టేడియాల్లో చేస్తూ ఫ్యాన్స్‌కు మరింంత జోష్ నింపుతుండడం విశేషం.