ఇటు ప్రభాస్… అటు అమితాబ్… కేక పుట్టించే కాంబినేషన్!

భారతదేశంలోని ఇద్దరు సూపర్ స్టార్ హీరోలను ఒక్క సినిమాలో కి తీసుకొచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కేక పుట్టించే కాంబినేషన్ సెట్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ పక్కన యాక్ట్ చెయ్యనుంది. అంతకంటే మోస్ట్ ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే… ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చెయ్యనున్నారు. అఫీషియల్ గా ఈ న్యూస్ ఈ రోజు అనౌన్స్ చేశారు.

“లెజెండ్ లేకుండా లెజెండరీ ఫిలిం తియ్యడానికి ఎలా ప్రయత్నం చెయ్యగలం? ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్లను ఒక్క సినిమాలోకి తీసుకొస్తున్నాం” అని వైజయంతి మూవీస్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అమితాబ్ బచ్చన్ స్టార్డం గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏముంది? అందరికీ తెలిసిందే! వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నారు అంటే… సినిమాకి సూపర్ క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి యాక్ట్ చేసిన ‘మనం’లో అమితాబ్ అతిథి పాత్రలో కనిపించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’లో చిరుకి గురువు పాత్రలో నటించారు. ఆ తరువాత ఆయన నటిస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా ప్రభాస్ దే. “ఫైనల్లీ… కల నిజమైంది. లెజెండరీ అమితాబచ్చన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది” అని ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus