SSMB29 : మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!

  • January 22, 2024 / 08:24 PM IST

మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇలా ఈ సినిమాని ఫినిష్ చేశాడో లేదో వెంటనే తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అయిపోతున్నాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ చాలా వరకు లాక్ అయ్యింది. ఏప్రిల్ లేదా మే నెల నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

2026 కి ప్రాజెక్టు ఫినిష్ చేసి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించనున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ మధ్యనే టెక్నికల్ టీంతో ముచ్చటించేందుకు మహేష్ బాబు జెర్మనీ వెళ్లారు.కనీసం అధికారిక ప్రకటన రాకుండానే ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఇండోనేషియన్ భామ చెల్సియా ఇస్లాన్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరిగింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం చిత్ర బృందం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో (Amitabh Bachchan) అమితాబ్ ను సంప్రదిస్తున్నట్టు వినికిడి. గతంలో ‘బాహుబలి’ కోసం కూడా రాజమౌళి అండ్ టీం అమితాబ్ ని సంప్రదించింది. కానీ అప్పుడు అమితాబ్ ఓకే చెప్పలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ‘నేను మంచి ఛాన్స్ మిస్ అయ్యాను’ అంటూ ఆయన బాధ పడిన క్షణాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు కచ్చితంగా ఆయన ఓకే చేసే ఛాన్సులు ఉన్నాయి.మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టుకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో పాటు ఎస్.ఎస్.కాంచి కూడా స్క్రిప్ట్ లో వర్క్ చేసినట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus