బాహుబలి చిత్రం తర్వాత దగ్గుబాటి రానా యధావిధిగా హీరో పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పుడు అతని పరిధి పెరగడంతో ఒకేసారి రెండు మూడు భాషలో తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా హీరోగా రూపుదిద్దుకున్న ‘ఘాజీ’ సినిమా హిందీ, తెలుగులో నిర్మితమైంది. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో సాగే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రత్యేక హంగులు జోడిస్తున్నారు. మూవీ మొదలయ్యేటప్పుడు వచ్చే వాయిస్ ఓవర్ కోసం స్టార్ హీరోలను సంప్రదించారు.
హీందీ వెర్షన్ కి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా, తెలుగు వెర్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొంతు అరువు ఇవ్వనున్నారు. త్వరలో వీరి వాయిస్ రికార్డ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ తాప్సి హీరోయిన్ గా నటించింది. ఎక్కువశాతం సముద్రం అడుగుభాగంలో చిత్రీకరణ జరుపుకున్న మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని హీరో రానా చెప్పారు. ఇందులో భల్లాల దేవా నేవీ ఆఫీసర్ గా ఆకట్టుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.