Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు
- February 7, 2026 / 02:04 PM ISTByPhani Kumar
విశ్వక్ సేన్(Vishwak Sen) తండ్రి కరాటే రాజు మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. అయితే విశ్వక్ సేన్ మాత్రం నందమూరి హీరోలైన బాలకృష్ణ, తారక్..లకి వీరాభిమాని. ఆ హీరోలతో ఇతనికి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. బాలయ్య, ఎన్టీఆర్ ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నప్పటికీ.. విశ్వక్ సేన్ మాత్రం వారధిలా వ్యవహరిస్తున్నాడు. ఆ స్టార్ హీరోలు కూడా విశ్వక్ సేన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.
Vishwak Sen
విశ్వక్ సేన్ సినిమా వస్తుందంటే.. ఆ ఇద్దరిలో ఎవరొకరు వచ్చి ప్రమోషన్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.అంతేకాదు వాళ్ళ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉంటే.. విశ్వక్ సేన్ ని కూడా ఆహ్వానిస్తున్నారు. అలాంటి విశ్వక్ సేన్ సినిమా ఏదైనా అటు ఇటు అయితే.. వాళ్ళు కామ్ గా ఎందుకు ఉంటారు.చెప్పాలంటే విశ్వక్ ఈ మధ్య చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి.

అయితే ‘లైలా’ అనే సినిమా మాత్రం ఇతని కథల ఎంపిక పై అనుమానాలు ఏర్పడేలా చేసింది. ‘విశ్వక్ ట్రాక్ తప్పాడేమో’ అనే అనుమానం కూడా చాలా మందికి కలిగింది. ఆ సినిమా వల్ల ఎన్టీఆర్, బాలయ్య కూడా అతన్ని మందలించారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విశ్వక్.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ… “నా గత చిత్రం(లైలా) డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత నా బ్రదర్ లాంటి ఎన్టీఆర్ గారు, గాడ్ ఫాదర్ లాంటి బాలకృష్ణ గారు నన్ను మందలించారు. ప్రతీదీ ఓపెన్ గా చెప్పలేను. అలాంటి సినిమాలు అయితే చేయొద్దని.. మరోసారి వాటి జోలికి పోవద్దని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చాడు.
















