మా ఆయన దివితో జెన్యూన్ గా ఉన్నారు!

గత వారం దివి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ.. అమ్మా రాజశేఖర్ కూడా ఒక కారణమని చెబుతున్నారు. మాస్టర్ తో తనకున్న బాండింగ్ దివిపై ఎఫెక్ట్ చూపించిందని అంటున్నారు. హౌస్ లో మొదట ఎంతో జెన్యూన్ గా ఉన్న అమ్మా రాజశేఖర్ ఆ తరువాత సెల్ఫిష్ గా మారిపోయాడు. అలాంటి అమ్మా రాజశేఖర్ తో దివి బాండింగ్ పెట్టుకోవడం.. ఈ ఇద్దరూ కలిసికట్టుగా గేమ్ ఆడటం.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు.

అమ్మా రాజశేఖర్ గుండు కొట్టించుకున్న ఎపిసోడ్ లో కూడా దివి తెగ ఏడ్చేసింది. ఇదిలా ఉంటే.. మొత్తానికి దివి ఎలిమినేషన్ కి అమ్మా రాజశేఖర్ కూడా ఒక కారణమనేది తప్పక ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ఈ ఇద్దరి బాండింగ్ ఫై బయట రకరాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో అమ్మా రాజశేఖర్ భార్య రాధ ఫైర్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మా రాజశేఖర్ భార్య.. దివితో తన భర్తకున్న బంధం గురించి మాట్లాడింది. దివి, రాజశేఖర్ ఒకరికొకరు సపోర్టర్లుగా మాత్రమే ఉన్నారని.. వాళ్లది జెన్యూన్ బాండింగ్ అని అన్నారు.

తన భర్తకి లవ్ ట్రాక్ లు ఉన్నాయంటే అది కామెడీనే అని.. తనకైతే అలాంటివి ఉన్నాయని అనిపించడంలేదని.. మేల్, ఫిమేల్ క్లోజ్ గా ఉంటే లవ్ వచ్చేస్తుందా..? అంటూ ప్రశ్నించారు. కరాటే కళ్యాణితో మొదట్లో తన భర్త రొమాంటిక్ గా చేశారని.. అది కామెడీగానే అనిపించిందని.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకునేవాళ్ళకి ఏ యాంగిల్ లో అలా అనిపించిందో తనకు తెలియదని అన్నారు. దివి విషయంలో కూడా అంతేనని.. వాళ్లేమీ సీక్రెట్ గా మాట్లాడుకోలేదని అన్నారు. ఇప్పటివరకు ఆయన వందల మంది అమ్మాయిలతో పని చేశారని.. ఎప్పుడూ కూడా ఎలాంటి డిస్టబెన్స్ జరగలేదని చెప్పుకొచ్చారు. ‌

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus