సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ (‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’). 2019 ఎన్నికలు ముగిసిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కొన్ని రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని.. వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొంత మంది రాజకీయనాకుల పై సెటైరికల్ గా ఉండేలా తీసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయని చెప్పాలి. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ పై సైతం వర్మ ఈ చిత్రం ద్వారా సెటైర్ లు వేసాడు. ఇక ఈ చిత్రాన్ని మొదట నవంబర్ 29న విడుదల చేయాలని వర్మ అనౌన్స్ చేసినప్పటికీ.. సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. చివరికి సెన్సార్ పూర్తవ్వడంతో డిసెంబర్ 12న విడుదల చేసాడు వర్మ. ఇక చిత్రం మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 0.82 cr |
సీడెడ్ | 0.34 cr |
ఉత్తరాంధ్ర | 0.39 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.17 cr |
కృష్ణా | 0.26 cr |
గుంటూరు | 0.24 cr |
నెల్లూరు | 0.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.07 cr |
ఓవర్సీస్ | 0.05 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 2.71 cr(షేర్) |
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి 2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2.71 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి నాలుగు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో సినిమాని రూపొందించి.. జనాల్లో క్యూరియాసిటీ పెంచడంతో.. 2019 సంవత్సరం హిట్స్ లిస్ట్ లో ఈ చిత్రం కూడా చోటు సంపాదించుకుందని చెప్పొచ్చు.
Click Here For Amma Rajyam Lo Kadapa Bidalu Movie Review
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!