వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ (‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’). 2019 ఎన్నికలు ముగిసిన తరువాత నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని.. వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొంత మంది రాజకీయనాకుల పై సెటైరికల్ గా ఉండేలా.. తీసి క్యూరియాసిటీ పెంచాడు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ను సైతం వదిలిపెట్టలేదు.. వర్మ. ఇక ఈ చిత్రాన్ని మొదట నవంబర్ 29న విడుదల చేయాలని భావించినప్పటికీ.. సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. మొత్తానికి సెన్సార్ పూర్తవ్వడంతో డిసెంబర్ 12న విడుదల చేసాడు. ఇక చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి.
నైజాం
0.57 cr
సీడెడ్
0.24 cr
ఉత్తరాంధ్ర
0.27 cr
ఈస్ట్
0.19 cr
వెస్ట్
0.13 cr
కృష్ణా
0.20 cr
గుంటూరు
0.19 cr
నెల్లూరు
0.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.04 cr
ఓవర్సీస్
0.03 cr
వరల్డ్ వైడ్ టోటల్
1.97 cr(షేర్)
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి 2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 1.97 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 80 శాతం రికవరీ అయిపోయినట్టే..! ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 0.48 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి.. అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎంత వరకూ క్యాష్ చేసుకుంటుందో చూడాలి..!