గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కథానాయిక అమీ జాక్సన్ (Amy Jackson) , హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలో వీరి పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఆ విషయం చెబుతూ ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు కొత్త జంట. జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో అమీ – జార్జ్ ఆండ్రూకు అండ్రూ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. 2020లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నా..
కరోనా పరిస్థితుల కారణంగా ఆ పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ఎడ్ – అమీ తొలిసారి కలిశారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి అయింది. పెళ్లి వేడుక కోసం డిజైన్ చేసిన వైట్ గౌనులో అమీ జాక్సన్ దేవకన్యలా మెరిసిపోగా.. వైట్ బ్లేజర్, బ్లాక్ ప్యాంట్‌లో ఎడ్ వెస్ట్‌విక్ అదరగొట్టాడు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్ అంటూ కొన్ని జోకులు కూడా పేలుతున్నాయి. ‘మదరాసు పట్టణం’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో నటించిది. ‘ఎవడు’ (Yevadu) , ‘ఐ’, ‘2.0’(Robo 2.0) , ‘అభినేత్రి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ అమీ జాక్సన్ పరిచయమే.
‘ఏక్ దివానా థా’ (Ekk Deewana Tha) (హిందీ), ‘తాండవం’ (Thaandavam) (తమిళం), ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ (హిందీ), ‘తంగమగన్’ (Thanga Magan) , ‘గెతు’, ‘తెరి’ (Theri) , ‘ఫ్రీకీ అలీ’ (హిందీ), ‘బూగీ మ్యాన్’ (ఇంగ్లిష్), ‘ది విలన్’ (కన్నడ) సినిమాల్లో నటించింది. ‘మిషన్: ఛాప్టర్ 1’ అనే తమిళ సినిమా, ‘క్రాక్’ అనే హిందీ సినిమా ఈ ఏడాదిలో ఆమె నుండి వచ్చాయి. ఇప్పటికైతే ఆమె చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు.