Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Jr NTR: భుజాన బండ బరువుతో మారథాన్‌ పరుగు… తారక్‌ జర్నీ రివైండ్‌ చేసుకుంటే..!

Jr NTR: భుజాన బండ బరువుతో మారథాన్‌ పరుగు… తారక్‌ జర్నీ రివైండ్‌ చేసుకుంటే..!

  • May 20, 2025 / 12:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: భుజాన బండ బరువుతో మారథాన్‌ పరుగు… తారక్‌ జర్నీ రివైండ్‌ చేసుకుంటే..!

Dస్టార్‌ కిడ్‌, నెపో కిడ్‌, వంశం పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు, తాత పేరుతో మేనేజ్‌ చేసేస్తున్నాడు.. ఇలా ఒక్కటా రెండా మాటలొచ్చిన ప్రతి వ్యక్తి ఆయన్ను అనినవాడే. నిజానికి స్టార్‌ హీరోలు, నటుల వారసులు, ఇండస్ట్రీకి చెందిన వారిని పిల్లలకు ఈ మాటలు కామన్‌ అయిపోయాయి. పరిశ్రమలోనే ఉన్నవాళ్లే అంటుంటారు కూడా. అయితే ఈ అవసరంలేని ఉపమానాల వెనుక తెలియని బండంత బరువు కూడా ఉంటుంది. ఆ బరువును మోస్తూ నడవడమే కష్టం అనుకుంటే.. ఏకంగా మారథాన్‌ పరుగు పెడుతున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓసారి లైఫ్‌ను రివైండ్‌ చేసుకుందామా.

Jr NTR

తారక్‌ (Jr NTR)  సినిమాల గురించి మాట్లాడటానికి ముందు ఆయన ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడాలి. దీనికి సింగిల్‌ లైన్‌లో ఆన్సర్‌ కావాలి అంటే టైటిల్‌లో చెప్పినట్లు ‘సున్నుండ టు సూపర్‌ మిసైల్‌’ అని చెప్పొచ్చు. కావాలంటే మీరే చూడండి తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ (Ninnu Choodalani) నుండి ఇప్పుడు ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) (Dragon) వరకు ఆయన లుక్స్‌ చెక్‌ చేసుకోండి. ఇక్కడ సున్నుండ అని మేం అన్నాం అనుకునేరు. ‘ఆది’ (Aadi) సినిమాలో ఆయన్ను హీరోయినే అలా పిలిచింది. అప్పట్లో అలానే ఉండేవాడు లెండి. ఇప్పుడు సన్నగా అదేదో 20 – 25 కుర్రాడిలా మారిపోయాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
  • 3 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

‘రాఖీ’ (Rakhi) సినిమా నుండి ‘యమదొంగ’ (Yamadonga) సినిమా సమయానికి వచ్చేసరికి ఆయన హఠాత్తుగా తగ్గిపోయాడు. దీని వెనుక చాలా చర్చలు ఉన్నా.. ఆయన అలా తగ్గి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడు. అంతేకాదు అలా తగ్గినవాళ్లు కొనసాగడం చాలా గ్రేట్‌ అంటుంటారు. ఆ పని చేసి తాను గ్రేట్‌ అనిపించుకున్నాడు తారక్‌. ‘దేవర’ (Devara) సినిమా కోసం కాస్త లావెక్కిన తారక్‌.. మళ్లీ ఇప్పుడు ‘డ్రాగన్‌’ కోసం సన్నని రివటలా మారిపోయాడు. ఈ ఫిట్‌నెస్‌ జర్నీ ఎందరికో పాఠం. తనను విమర్శించిన వాళ్లకు గుణపాఠం.

తారక్‌ గురించి చెబుతూ.. తన వైవిధ్యమైన సినిమాల ఎంపిక గురించి మాట్లాడకపోతే అస్సలు బాగోదు. టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో తొలి నాళ్లలో చేయడానికి ముందుకురాని ఎన్నో పాత్రలు చేశాడు. ‘ఆది’ సినిమాలో వయసు మించిన పాత్ర బరువు మోశాడు. అప్పట్లో ఫ్యాక్షన్‌ బేస్డ్‌ సినిమా అంటే ‘సీనియర్‌ హీరో’నే చేయాలి అనుకునేవారు. కానీ తానూ చేసి చూపించాడు. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కావాలని యంగ్‌ హీరోలు అనుకునే రోజుల్లో ‘సింహాద్రి’ (Simhadri), ‘ఆంధ్రావాలా’, (Andhrawala) ‘సాంబ’ (Sambha), ‘నరసింహుడు’ (Narasimhudu), ‘రాఖీ’, ‘కంత్రీ’ (Kantri) అంటూ యాక్షన్‌ మోడ్‌లో కత్తి మీద సాము చేశాడు. విజయం సాధించాడు కూడా.

ఎవరైనా దర్శకుడు తారక్‌లో ఉన్న కామెడీని బయటకు తీస్తే బాగుండు అని చాలామంది అభిమానులు అనుకుంటుండగా.. అప్పుడు పడింది ‘అదుర్స్‌’ (Adhurs). ఇప్పటికీ ఆ జోనర్‌లో హీరో పాత్ర ఎవరైనా చేస్తున్నారు అంటే ‘అదుర్స్‌’ ఓ బెంచ్‌ మార్క్‌ అయిపోయింది. ప్రతినాయక లక్షణాలు ఉన్న హీరో పాత్ర చేయడానికి ముందుకు రాని హీరోలు ఉన్న ఈ రోజుల్లో రెండుసార్లు అలా నటించి వావ్‌ అనిపించాడు. ఒకటి ‘టెంపర్‌’ (Temper) అయితే.. రెండోది ‘జై లవకుశ’ (Jai Lava Kusa). ఈ రెండు సినిమాల్లో తారక్‌ చూపించే యాటిట్యూడ్‌కి సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో నటన గురించి మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. భీమ్‌గా తారక్‌ తనను తాను తెరపై చూపించుకున్న విధానం నభూతో నభిష్యతి. కొన్నిసార్లు తన పాత్ర అండర్‌ ప్లే అయినా.. తన ఛాన్స్‌ వచ్చినప్పుడు స్క్రీన్‌ మొత్తం తానే కనిపించాడు. స్క్రీన్‌ ప్రజెన్స్‌ విషయంలో నేటి తరం హీరోల్లో తనను మించినవాళ్లు లేరు అంటే తప్పు కాదేమో. ఇక్కడ ప్రస్తావించని సినిమాలు చాలానే ఉన్నాయి. అలా అని అవి హిట్‌ కావు అని కాదు.. అన్నీ చెబితే సినిమాల లిస్టే అవుతుందని.

30 సినిమాలకు చేరుకున్న తారక్‌ లాంగ్‌ మారథాన్‌లో అన్నీ విజయాలే లేవు. కొన్ని కోలుకోలేని పరాజయాలూ ఉన్నాయి. అయితే వాటి నుండి తేరుకొని, కోలుకొని తిరిగి పైకి లేచిన తారక్‌ పరుగు ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగాలని ఆశిద్దాం. ఇప్పుడు తారక్‌ చేతిలో ఉన్న మూడు సినిమాలు ‘దేవర 2’, ‘డ్రాగన్‌’, ‘వార్‌ 2’ అతనిని మరో ఎత్తులో నిలుపుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నామో తెలుసు కదా. హ్యాపీ బర్త్‌డే టాలీవుడ్‌ మిసైల్‌ తారక్‌.

War2 Movie Teaser Review

యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

3 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

4 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

5 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version