58 ఏళ్ళ ‘గుండమ్మ కథ’ చిత్రం వెనుక అంత కథ ఉందా?

‘గుండమ్మ కథ’ చిత్రం ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కనీసం 90’స్ బ్యాచ్ కూడా పేరు వినుంటారు కానీ సినిమా చూసి ఉండరు. కానీ ఇది ఒక క్లాసిక్. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్,సావిత్రి,జమున వంటి స్టార్ క్యాస్ట్ నటించిన చిత్రం ఇది. ఇప్పటి తరానికి తగినట్టు కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని చాలా మంది అగ్ర దర్శకులు ట్రై చేస్తున్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ‘గుండమ్మ కథ’ చిత్రం వచ్చి 58 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ చిత్రం వెనుక చాలా పెద్ద కథే నడిచిందట. అది తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోవడం ఖాయం.

సరే ఇక అసలు విషయానికి వద్దాం.. ‘విజయ వాహిని క్రియేషన్స్’ బ్యానర్ అధినేతలు అయిన బి.నాగిరెడ్డి , చక్రపాణి గారు ఓ జానపద చిత్రాన్ని నిర్మిస్తే .. ఆ తరువాత ఓ ఫ్యామిలీ చిత్రం చేస్తుండేవారు. అలాంటి టైంలో ఓ జానపద చిత్రం చేసిన తరువాత.. ఫ్యామిలీ చిత్రం చెయ్యాల్సిన టైంలో ఏ కథతో సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తుంటే.. విఠలాచార్య గారి కన్నడ సినిమా ‘మనె తుంబిద హెణ్ణు’ రైట్స్ తమ దగ్గర ఉన్నాయన్న విషయం గుర్తొచ్చి.. ఆ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యారట. ముందుగా బి.ఎన్.రెడ్డి గారే ఈ రీమేక్ ను తెరకెక్కించాలి అనుకున్నారు. స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. అయితే అంత మంచి దర్శకుడితో రీమేక్ ఎందుకు? అని భావించి P. పుల్లయ్య గారిని అడిగారట చక్రపాణి గారు. అయితే పుల్లయ్య గారు ఈ స్క్రిప్టు లో కథాబలం లేదు. తెలుగులో ఆడదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. కానీ చక్రపాణి గారికి ఎక్కడో బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ కథలో మార్పులు చేశారట. అంతేకాదు మరో రైటర్ నరసరాజు గారితో కూర్చుని పాత్రలను సైతం మార్చేశారట. అయితే డైలాగ్ వెర్షన్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేశారట. అప్పట్లో నెలరోజల లోపే సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోయేది.

కానీ ఈ చిత్రాన్ని సంవత్సరం పాటు తెరకెక్కించారట. ఈ చిత్రంలో పెద్ద పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉంది. కాబట్టి వారి డేట్స్ అడ్జస్ట్ కావాడానికి అంత టైం పట్టిందని తెలుస్తుంది. కె. కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు. రెండు సీన్స్ అనుకోడం దానికి డైలాగ్స్ రాసుకోవడం.. తరువాత షూటింగ్ చెయ్యడం. అలా జరిగిందట. సినిమా మొత్తం పూర్తయ్యాక కూడా ఇది ఆడదు అని చాలా మంది కామెంట్స్ చేశారట. కానీ చక్రపాణి గారు మాత్రం మొదటి నుండీ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారట. చివరికి ఆయన నమ్మకమే నిజమైందని స్పష్టమవుతుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే..! ఎడ్ల బండులు కట్టుకుని మరీ గ్రామాల్లో నుండీ ప్రజలు సినిమా చూడడానికి టౌన్ ను వెళ్లేవారట. ఆ సినిమా రిజల్ట్ తో చక్రపాణి గారి జడ్జ్మెంట్ పై ఇండస్ట్రీలో మరింత నమ్మకం ఏర్పడిందట.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus