మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ‘వైజయంతి మూవీస్’ పతాకం పై సి.అశ్వినీ దత్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలయ్యింది.ఈరోజుతో ఈ సినిమా విడుదలయ్యే 31 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అప్పటి రోజుల్లోనే ఈ చిత్రాన్ని రూ.9 కోట్ల భారీ బడ్జెట్ తో దత్ గారు నిర్మిస్తుండడంతో ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న దర్శకనిర్మాతలు ఆయనకు ఫోన్ చేసి హెచ్చరించారట. కానీ ఆయన వెనకడుగు వెయ్యలేదు.
ధైర్యం చేసి ప్రాజెక్టుని పూర్తి చేసారు. కానీ విడుదల ముందు నుండీ భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి రోజుల్లాగా డిజిటల్ సిస్టం కాదు. ప్రింట్లు రవాణా అవ్వాల్సిందే. విడుదల రోజున షోలు లేట్ అయ్యాయి. ఆ వర్షాల్లో వంట చేసుకోవడానికే సామాన్యులు అనేక కష్టాలు పడ్డారట. అలాంటప్పుడు సినిమాకి వెళ్లేంత కోరిక వాళ్లకు ఉంటుందా..! ప్రకృతి మాత్రం చిరంజీవి సినిమా అని వెనకడుగు వేస్తుందా ఏమిటి..? కానీ జనాలు మాత్రం ముందడుగు వేశారు. గొడుగులు వేసుకుని థియేటర్లకు వచ్చారు. థియేటర్లో మొత్తం వర్షమే..! అయినా వారు వెనకడుగు వెయ్యలేదు. మొదటి వారం ఓపెనింగ్స్ డల్ గా నమోదయ్యాయి.
కానీ పక్క సినిమాలకు ఇందులో మొదటి వంతు కూడా నమోదవ్వలేదు. రెండో వారం నుండీ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటికి కూడా వర్షాలు ఏమీ తగ్గలేదు అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురుస్తూనే ఉన్నాయట. అలా ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.15 కోట్లను రాబట్టిందట. కమర్షియల్ గానే కాకుండా ఇది ఒక విజువల్ వండర్ అని కూడా చెప్పాలి. ఇప్పటికీ బుల్లితెర పై ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ప్రసారం అవుతుంది అంటే కదల కుండా చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!