యానిమల్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తూ యానిమల్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఒకరు ఈయనకి రెండవ సినిమా కావటం విశేషం. ఈయన తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా తెలుగులో మంచి హిట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు అక్కడ కూడా ఈ సినిమా నుంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయవంతం కావడంతో ఈయనకు యానిమల్ సినిమా చేసే అవకాశం లభించింది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూ పాల్గొన్నటువంటి సందీప్ రెడ్డి సినిమాపై తనకు సినిమాలపై ఉన్నటువంటి ఫ్యాషన్ తెలియజేశారు. తనకు సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని ఎప్పటినుంచో ఉండేది దీంతో ఈయన సినిమాలలోకి వచ్చి సినిమాలలో స్థిరపడటానికి తనకు ఉన్నటువంటి 36 ఎకరాల మామిడి తోటను అమ్మేశాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు
అయితే తమ పొలాలు చాలా తక్కువ రేటు ఉండడంతో ఇంత భూమికి గాను రెండు కోట్ల వరకు డబ్బు వచ్చిందని తెలియజేశారు. ఇందులో భాగంగా 1.5 కోట్ల రూపాయలతో ఈయన అర్జున్ రెడ్డి సినిమా చేశానని తెలిపారు. ఇలా సినిమాలలోకి రావడం కోసమే తాను తన భూమి మొత్తం అమ్ముకున్నానని అర్జున్ రెడ్డి సినిమా కనుక ఏ మాత్రం తేడా కొట్టిన కుటుంబం మొత్తం రోడ్డుపై పడే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
ఇలా సినిమాలలోకి రావాలనే ఉత్సాహంతో భారీ స్థాయిలో ఉన్నటువంటి తన పొలాన్ని ఇంత తక్కువ రేటుకు అమ్ముకున్నారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలని ఈయన కోరిక తీరిందన్న చెప్పాలి ఇక నెక్స్ట్ ఈయన ప్రభాస్ స్పిరిట్ పనులలో బిజీ కానున్నారు.