సమంత ఈ మధ్యనే అమెరికా వెళ్ళింది. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె వైద్య చికిత్స కోసం విదేశాలకి వెళ్ళింది అంటూ వార్తలు వచ్చాయి. సమంత వెళ్లింది ట్రీట్ మెంట్ కోసం అయితే కాదు.. ఆగస్టు 20న అక్కడ నిర్వహించిన ‘ఇండియా డే పరేడ్’ కార్యక్రమంలో పాల్గొనడానికి అని తర్వాత ఆమె పోస్ట్ చేసిన ఫొటోలతో, పోస్టులతో తెలిసొచ్చింది. అక్కడితో అయిపోలేదు ఓవర్సీస్ తన అప్ కమింగ్ మూవీ ‘ఖుషి’ ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అక్కడ జరిగిన ఓ ఈవెంట్ లో కూడా ఈమె పాల్గొంది. ఈ క్రమంలో ఆ ఒక్క ఈవెంట్ కోసం సమంతకి అక్షరాల రూ.30 లక్షలు చెల్లించారట మేకర్స్. అలాగే ఈ ఈవెంట్ లో పాల్గొనే వాళ్లకి రూ.12 వేల నుండి రూ.2 లక్షల వరకు టికెట్ రేట్లు ఫిక్స్ చేశారట నిర్వాహకులు. 2 లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకులకు సమంతకి దగ్గరగా కూర్చునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
ఓవర్సీస్ లో సమంత (Samantha) సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి ఈ ఈవెంట్ కి ఎక్కువమంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సమంత ఈ ఏడాది ‘శాకుంతలం’ తో తన ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. అందుకే ‘ఖుషి’ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.