చిరంజీవి, రోజా ల వింటేజ్ పిక్ వెనుక ఉన్న కథ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి అలాగే అప్పటి స్టార్ హీరోయిన్ రోజా.. కలిసి ఉన్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. ఈ పిక్ ఏ చిత్రానికి సంబంధించింది అంటూ నెటిజన్లు తెగ డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. హార్డ్ కోర్ చిరు ఫ్యాన్స్ అయితే.. ఈ పిక్ ఏ చిత్రానికి సంబంధించినదో ఇట్టే చెప్పేస్తున్నారు. చిరంజీవి, రోజా .. కలిసి ‘ముఠామేస్త్రి’ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాల్లో నటించారు. ‘జెంటిల్మెన్’ చిత్రం హిందీ రీమేక్లో చిరు నటించిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రంలో చిరు – రోజా ఓ స్పెషల్ సాంగ్లో నర్తించారు. అయితే ఈ పిక్ మాత్రం.. ‘ముఠామేస్త్రి’ చిత్రానికి సంబంధించినది. ఆ చిత్రానికి సంబంధించి ఇది ఒక అన్ సీన్ పిక్ అని తెలుస్తుంది. ఇక చిరు- రోజా ల మధ్య 2009 ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగియిన సంగతి తెలిసిందే. అది రాజకీయాల వల్లే తప్ప వ్యక్తిగతంగా వారి మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తలేదు. ఎన్నికలు ముగిసాక వీరిద్దరూ కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న సందర్భాలను కూడా మనం చూస్తూ వచ్చాము.

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం టైములో చిరుని రోజా ఇంటర్వ్యూ చేసింది కూడా..! ఆ ఇంటర్వ్యూలో వీరు పాత స్నేహితులులాగానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇక చిరు సోదరుడు నాగబాబుతో కలిసి 7ఏళ్ళ పాటు ‘జబర్దస్త్’ కు జడ్జిగా వ్యవహరించింది రోజా..! ఆ టైములో చిరు, పవన్ ల గురించి రోజా పాజిటివ్ కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే..!

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus