RRR Teaser: ఆర్ఆర్ఆర్ టైగర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొదటి బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

అయితే విడుదలైన టీజర్ ను చూసిన తరువాత ఒక అనుమానం కూడా కలుగుతోంది. సినిమాలో పులికి సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. టీజర్ మొదట్లో భీమ్ పరిగెత్తుతూ ఉన్నప్పుడు అతని వెనకాలే పులి కూడా పరిగెత్తుతూ కనిపించింది. చివరలో పులి బ్రిటిష్ సైనికులపై కూడా దాడి చేసేందుకు సిద్ధమైనట్లు అర్థం అయింది. దీన్ని బట్టి కొమరం భీమ్ ఆ పులిని స్నేహంగా మార్చుకున్నాడా లేక తెలివిగా దాన్ని వారిపై ఉసిగొలిపాడా అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.

ఏదైమైనా సినిమా లో టైగర్ కు సంబంధించిన ఎపిసోడ్ సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అని అర్థమవుతుంది. ఇక అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ కు దర్శకుడు రాజమౌళి పై ఎలాంటి పవర్ఫుల్ సీన్స్ ప్లాన్ చేశారో చూడాలి. అజయ్ దేవగన్ శ్రీయ అలియా భట్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus