రామ్‌ మిరియాల ఎలా వచ్చాడు… అంతకుముందు ఏం చేశాడు

‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే…’, ‘సాంబశివ నీదు మహిమ… ఎన్నటికీ తెలియదాయే’,‘సిలకా.. ఎగిరిపోయావా…’ ఈ మూడు పాటలు పాడింది ఒక్కడే. కానీ ఆ గొంతులో ఏదో తేడా, ఆ యాసలో ఏదో మజా, ఆ పలుకులో ఏదో కొత్త దనం. ఒక గాయకుడి గొంతులో అంత తేడా ఎక్కడ నుంచి వస్తోంది. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి, మ్యూజిక్ లవర్‌కి కచ్చితంగా ఈ ప్రశ్న వస్తుంది. ఈ పాటలు అన్నీ రామ్‌ మిరియాల గొంతు నుండి వచ్చినవే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లదు. ఆయన గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా.

రామ్‌ మంచి పాటగాడే కాదు… చక్కటి గీత రచయిత కూడా. అంతే కాకుండా సంగీత దర్శకుడు కూడా. రామ్‌ పుట్టింది తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలంలోని కోలంక. డిగ్రీ చదువుకోవడానికి హైదరాబాద్‌ వచ్చేశాడు. వెస్లీ కాలేజీలో బీకామ్‌ చేశాడు. తర్వాత కార్పొరేట్‌ కంపెనీలో ట్యాక్స్‌ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు రేడియో మిర్చీలో ప్రోమో ప్రొడ్యూసర్‌గా కూడా పని చేశాడు. స్నేహితులు యశ్వంత్‌, శ్రీని, బాల, అనంత్‌, అక్షయ్‌తో కలసి రెండేళ్ల కిందట ‘చౌరస్తా’ బ్యాండ్‌ని ఏర్పాటు చేశాడు. అలా ‘మాయ… మాయ…’, ‘ఊరెళ్లిపోతా మామ…’, ‘చేతులెత్తి మొక్కుతా…’ లాంటి పాటలు చేశారు.

ఆ తర్వాత సినిమాల కోసమని చౌరస్తా బ్యాండ్‌ నుంచి రామ్‌ బయటకు వచ్చేశాడు. అయితే ముందుగా చెప్పుకున్నట్లు రామ్‌ పాటలో గోదావరి యాస్‌, తెలంగాణ మాండలికం ఉంటాయి. ఎలా అంటే.. రామ్‌ గోదావరి జిల్లాలో పుట్టి పెరగడంవల్ల ఆ యాస తెలుసు. హైదరాబాద్‌లో 20 ఏళ్లుగా ఉంటున్నాడు కాబట్టి ఈ యాస తెలుసు. అంతకుమించి సిరిసిల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తెలంగాణ యాస బాగా పట్టేసిందట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus