తమిళ ప్రజలంతా అమ్మ అని పిలుచుకునే జయ లలిత గారి గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటక చెందిన మైసూర్ లో ఈమె జన్మించింది.మంచి చదువు చదివి.. ప్రయోజికురాలు అవ్వాలని కలలు కన్న జయలలిత… ఆ కోరికను మాత్రం తీర్చుకోలేకపోయింది. తన తల్లి ఒత్తిడి మేరకు 15 ఏళ్ళకే సినిమాల్లోకి అడుగు పెట్టింది.
ఆమె నటించిన మొదటి కన్నడ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈమె వ్యక్తి గత విషయాల గురించి చాలా మందికి తెలీదనే చెప్పాలి. అప్పట్లో మన టాలీవుడ్ అందగాడు శోభన్ బాబుతో ఈమె సహజీవనం చేసేది అని బాగా ప్రచారం జరిగంది. అతనితో కలిసి జయ లలిత పలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది. అంతకు ముందు ఎం.జి.ఆర్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపిందని కూడా ప్రచారం నడిచింది.
ఇక ఒకానొక టైములో జయలలితను అసెంబ్లీ లో దారుణంగా అవమానించారట. ఆ టైములో జయలలిత చీర పట్టుకుని లాగడంతో ఆమె క్రింద పడిపోయిందట. ఈ విషయాన్ని తెలుసుకున్న శోభన్ బాబు చాలా బాధ పడ్డాడట. ‘తనని అడ్డం పెట్టుకునే.. జయలలితను అవమానించారని’ అతను.. తన సన్నిహితుల దగ్గర అలాగే జయలలిత సన్నిహితుల దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడట.దానికి ప్రధాన కారణం ఎంతనేది మాత్రం ఇప్పటికీ తెలీదు.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!