ఇద్దరు దివంగత నటీమణులు కలిసిన ఆ రోజుల్లో…!

అతి తక్కువ టైంలోనే… విపరీతమైన పోటీ ఉన్న రోజుల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి … స్టార్ గా ఎదిగిన భామల్లో సౌందర్య ముందు ఉంటుంది. ఫ్యామిలీ చిత్రాలకి ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ అంటే టక్కున సౌందర్య పేరే చెప్తారు. ‘స్టార్ హీరోయిన్ అనే ఇగో ఆమె ఎప్పుడూ చూపించ లేదు.. పెద్ద స్టార్ లతో నటిస్తున్నప్పుడు కూడా చిన్న హీరోలతో నటించేది. కమెడియన్ లు అలీ, బాబు మోహన్ వంటి వారి సరసన కూడా ఎటువంటి నామోషీ లేకుండా చిందేసింది.

ఆమె చాలా డౌన్ టు ఎర్త్’ అని అప్పటి దర్శకులు సౌందర్య పై ప్రశంసలు కురిపించేవారు. 2004 లో విమాన ప్రమాదంలో ఈమె మరణించింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి … అతిలోక సుందరి రేంజ్ స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రీదేవి. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే… బాలీవుడ్ ను సైతం ఓ ఊపు ఊపేసిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి అనే చెప్పాలి. 2018 లో దుబాయ్ లో ఈమె మరణించింది.

అటు సౌందర్య, ఇటు శ్రీదేవి ఇద్దరు గ్లామర్ మరియు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీలు కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఈ ఫోటో తీసారు. మన తెలుగు స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ హిందీలో అమితాబ్ తో తీసిన ‘సూర్యవంశ్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులకి కూడా పరిచయం అయ్యింది సౌందర్య. అప్పట్లో శ్రీదేవి తో కూడా ఈమెకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటు సౌందర్య కూడా మెరిసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus