Anil Ravipudi: ‘వెంకటేష్ 76 ‘ ప్రాజెక్టు వెనుక ఇంత కథ ఉందా?

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ‘సైంధవ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది వెంకీకి 75వ సినిమా.ఇప్పుడు తన 76వ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు. వెంకటేష్ తో సినిమా చేయడానికి తరుణ్ భాస్కర్ వంటి ఎంతో మంది దర్శకులు రెడీగా ఉన్నారు. అయితే తనకి ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు వెంకటేష్.ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయ్యింది.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ‘వెంకటేష్ 76’ ప్రాజెక్ట్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచినట్టు టాక్. విషయం ఏంటంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు.. ఈ కథని ముందుగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించించారట.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) వంటి యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో పనిచేయాలని చిరుకి కూడా చాలా ఆశగా ఉంది. కానీ ఎందుకో అనిల్ రావిపూడి చెప్పిన కథ పై ఆయన ఆసక్తి చూపలేదు. మరోపక్క ‘విశ్వంభర’ వంటి ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తూ ఆయన బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక చిరు నో చెప్పడంతో అదే కథని వెంకటేష్ కి వినిపించి ఓకే చేయించుకున్నారు అనిల్ రావిపూడి,దిల్ రాజు..లు..! గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ఎఫ్ 2 ‘ ‘ఎఫ్ 3 ‘ వంటి సూపర్ హిట్ చిత్రాలు దిల్ రాజు బ్యానర్లో చేశారు వెంకటేష్. అయితే అవి మల్టీస్టారర్ మూవీస్ కాగా.. ఇప్పుడు చేయబోయేది సోలో హీరో ప్రాజెక్టు అని తెలుస్తుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus