టాలీవుడ్ లో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. కానీ వీటన్నింటికి ట్రెండ్ సెట్టర్ మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమగోల’. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలతో తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న అన్న గారు మరోసారి తన నట విశ్వరూపం చూపించి కలెక్షన్ల వర్షం కురిపించారు. కెమెరామెన్ వెంకటరత్నం నిర్మాతగా.. డీవీ నరసరాజు కథను అందించిన ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడిగా వ్యవహరించారు.
1977 అక్టోబర్ 21న విడులైన యమగోల చరిత్ర సృష్టించింది. లవకుశ, దానవీరశూరకర్ణ, అడవిరాముడు తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 28 సెంటర్లలో 100 రోజులు, 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇక అన్నింటికీ మించి చక్రవర్త సంగీత సారథ్యంలో వచ్చిన ఓలమ్మి తిక్కరేగిందా, చిలకకొట్టుడు కొడితే, గుడివాడ యెల్లాను పాటలకు థియేటర్లలో జనం ఊగిపోయేవారు. అన్నగారి అభిమానులైతే స్క్రీన్ మీదకు డబ్బులు విసిరేవారట. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ చేయాల్సి వుండగా.. యముడిగా ఎన్టీఆర్ నటించాల్సింది.
కానీ అప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవాంతకుడు’లో ఆయన యముడిగా నటించి వున్నారు. మళ్లీ ఎన్టీఆర్ యముడిగా నటిస్తే జనం రియాక్షన్ ఎలా వుంటుందోనన్న భయంతో బాలయ్యను హీరోగా అనుకున్నారు. అయితే ఇది అన్నగారికి నచ్చలేదు. బాలయ్య సొంత బ్యానర్ లో తప్పించి వేరే బ్యానర్ లలో సినిమాలు చేయడం రామారావుకు నచ్చదు. దీంతో బాలకృష్ణను తప్పించి.. తానే హీరోగా నటించాలని అనుకున్నారు.
అంతేకాకుండా తాను చేయాల్సిన యముడి పాత్రకు కైకాల సత్యనారాయణను రికమెండ్ చేశారు. అలా డివైన్ కామెడీతో వచ్చిన యమగోల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తెలుగులో ఇంత పెద్ద బ్లాక్ బస్టరైన యమగోల.. హిందీ (లోక్ పరలోక్), తమిళం (యమునక్కు యమన్)లో రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాప్ కావడం గమనార్హం.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!